
కన్నడ స్టార్ హీరో యశ్ ప్రస్తుతం ఆయన కొత్త చిత్రం ‘టాక్సిక్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అయితే నటి రష్మిక మందన్న తనపై చేసిన కామెంట్స్‌పై యశ్ తాజాగా స్పందించారు. 2017లో ఓ ఇంటర్వ్యూలో రష్మిక.. యశ్‌ను ఉద్దేశించి ‘మిస్టర్ షో ఆప్’ అని కామెంట్ చేసింది. దీనికి యశ్ తనదైన శైలీలో బదులిచ్చారు.
‘‘ఆమె ఏ ఉద్దేశంతో అలా అన్నారో నాకు తెలియదు. అప్పట్లో తను ఇండస్ట్రీకి కొత్త, కొన్ని టివి షోలలో యాంకర్లు 3-4 ఆప్షన్లు ఇచ్చి ఒకటి ఎంచుకోమంటారు. ఆ ఆప్షన్లలో నాకు ఇది సరిపొతుందని రష్మిక భావించి ఉండొచ్చు. నేను మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఎవరి అభిప్రాయం వాళ్లది. అయినా, ఒకరి అభిప్రాయం నా వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ నిర్ణయించలేదు. ఇతరుల దృష్టికోణాన్ని బట్టి నా క్యారక్టర్ మారదు’’ అని యశ్ స్పష్టం చేశారు. అలాగే తన అభిమానులను ఉద్దేశించి.. ‘‘సహ నటీనటులను గౌరవించని వారు నా అభిమానులు కారు’’ అని చెప్పారు. ఇక, రష్మిక వ్యాఖ్యలపై అప్పట్లో యశ్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ట్రోల్ చేయడంతో ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.








