
మాంచెస్టర్: భారత టీనేజ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కొత్త రికార్డు నెలకొల్పాడు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తొలి భారత ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. దీంతో సచిన్ టెండూల్కర్(16 ఏళ్లు 205 రోజులు) 37 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ బరిలోకి దిగి ఈ ఫీట్ సాధించాడు. 15 ఏళ్ల 99 రోజుల వయసులో అరంగేట్రం చేసిన వైభవ్.. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ ప్లేయర్ హసన్ రాజా (14 ఏళ్ల 227 రోజులు) అగ్రస్థానంలో ఉన్నాడు.













