
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రయాణ, పర్యాటక రంగంలో సేవలు అందిస్తున్న ట్రావెల్ సంస్థ సదరన్ ట్రావెల్స్ 2026 సంవత్సరానికి గ్లోబల్ టూరిజం అవార్డు - అందుకుంది. నాణ్యమైన సేవలు, వినూత్న ఆలోచనలు, కస్టమర్ సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వడం, పర్యాటక రంగ అభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి శ్రీ కృష్ణ మోహన్ మాట్లాడుతూ, ఈ అవార్డు తమ సంస్థకు లభించిన గర్వకారణమైన గుర్తింపని తెలిపారు.
ఉద్యోగులు, సిబ్బంది నిరంతర కృషి, ఎన్నో సంవత్సరాలుగా వినియోగదారులు చూపుతున్న విశ్వాసమే ఈ విజయానికి కారణమన్నారు. భవిష్యత్తులో మరింత వినూత్నమైన సేవలు అందిస్తూ, ప్రయాణికులకు అద్భుతమైన అనుభవాలను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. 56 సంవత్సరాల దీర్ఘకాల ప్రయాణ రంగ అనుభవంతో సదరన్ ట్రావెల్స్ దేశీయ, అంతర్జాతీయ పర్యాటక రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని ఆలపాటి శ్రీకృష్ణ మోహన్ హర్షం వ్యక్తం చేశారు. ***








