నవతెలంగాణ – హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతి మిల్క్ ఎదురుగా ఉన్న అనధికార స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలోని కెమికల్ డ్రమ్ములు పేలడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ పేలుళ్ల శబ్దాలకు భయాందోళనకు గురైన సమీప అపార్ట్మెంట్ వాసులు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. […]
The post సూరారంలో భారీ అగ్ని ప్రమాదం.. appeared first on Navatelangana.








