శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెటర్ యశస్వి జైస్వాల్, లంక బౌలర్ అసిత ఫెర్నాండో మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) స్పందించింది. జైస్వాల్‌‌పై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఐసిసి ప్రవర్తనా నియమావళిలోని లెవెల్-1ను ఉల్లంఘించినట్లు తేలడంతో యశస్వితో పాటు ఫెర్నాండోకు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. అంతేకాక ఇద్దరికీ చెరో డీమెరిట్ పాయింట్ ఇచ్చింది.

అసలేం జరిగిందంటే.. తొలి ఆటలో జైస్వాల్‌ను ఔట్ చేసిన తర్వాత ఫెర్నాండో అత్యుత్సాహం ప్రదర్శించాడు. దీంతో జైస్వాల్ అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో జైస్వాల్ హెల్మెట్ ఫెర్నాండో నుదుటికి తాకింది. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉండటంతో లంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా, వైస్ కెప్టెన్ కమిందు మెండిస్‌తో పాటు ఇతర ఆటగాళ్లు, అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్దరినీ దూరం తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.