
హైదరాబాద్: టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత కాకర్ల కృష్ణ శనివారం ఫిల్మ్‌నగర్‌లో వృద్ధాప్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేసిన నిర్మాతల మండలి కృష్ణ మృతికి సంతాపం తెలియజేసింది. ఈ విషయం తెలిసి పలువురు నిర్మాత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ప్రముఖ నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ ‘జగపతి’ సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్‌గా కృష్ణ.. ఎన్నో సూపర్‌హిట్ సినిమాలకు పని చేశారు. ఆ అనుభవంతోనే 1974లో కృష్ణ, అంజలీ దేవి నటించిన ‘ఇంటింటి కథ’ చిత్రంతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత ఏడంస్తుల మేడ, ఊరంత సంక్రాంతి, రాగదీపం తదితర సినిమాలు నిర్మించారు.















