
లక్నో: ప్యాంట్, షర్ వేసుకుంటుందని భార్యను భర్త హత్య చేసి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... షాదాబ్ (25) అనే యువకుడు, మేనమామ కూతురు నిఖత్ నిషాను(24) పెళ్లి చేసుకున్నాడు. షాదాబ్ తండ్రి దుబాయ్ లో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. షాదాబ్ పెళ్లైన తరువాత ఉద్యోగం లేకపోవడంతో పలుమార్లు ఉద్యోగం చూసుకోవలని భార్య హెచ్చరించింది. మేనమాయ కుటుంబ ముంబయిలో ఉండడంతో నిఖత్ ప్యాంట్, టీ షర్ట్ ధరించేది. షాదాబ్ గ్రామంలో ఉండడంతో అతడి కట్టుబాట్లు ఎక్కువగా ఉండేవి. భార్యను పలుమార్లు టీ షర్ట్, జీన్స్ ప్యాంటు వేసుకోవద్దని హెచ్చరించాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. భార్య చంపి అనంతరం అతడు ఉరేసకున్నాడు. గదిలో నుంచి ఉలుకుపలుకు లేకపోవడంతో స్థానికుల సహాయంతో బలవంతంగా డోర్ ను ఓపెన్ చేసి చూడగా ఇద్దరు విగతజీవులుగా పడి ఉన్నారు. పోలీసులు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో వాట్సప్ సందేశాలలో చాటింగ్ ఉండడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగినట్టు తెలిసింది.














