
బీదర్: తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్-జహీరాబాద్ రోడ్డుపై అదుపుతప్పిన కర్ణాటక ఆర్టీసీ బస్సు.. బైక్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదుగురు ప్రయాణికులు.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఘటన జరిగిన వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని బీదర్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు సంగారెడ్డి జిల్లా నాల్కల్ కు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సు.. బీదర్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.














