నవతెలంగాణ – హైదరాబాద్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని ఆర్మీ వెపన్స్ డిపోపై రష్యా డ్రోన్లతో భీకర దాడి చేసింది. ఈ దాడిలో షెల్స్, మైన్స్ కారణంగా భారీ పేలుళ్లు సంభవించి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 38 మంది మృతి చెందగా, 42 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని నెలల కాలంలో ఇదే అతిపెద్ద దాడిగా పేర్కొన్నారు.
The post ఉక్రెయిన్ లో భారీ పేలుళ్లు.. 38 మంది మృతి appeared first on Navatelangana.









