హైదరాబాద్: సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలం ఎర్రగడ్డ తండాలో దారుణం చోటు చేసుకుంది. రెండు ఇళ్ల మధ్య ఉన్న వేపచెట్టు విషయంలో వివాదం జరగింది. గొడ్డళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇరు వర్గాలను ఆపే క్రమంలో మేళ్ల చెరువు ఎస్ఐ నవీన్ కుమార్ కు గాయాలయ్యాయి.