కామారెడ్డి: సోషల్ మీడియాలో లైక్ లు, వ్యూస్ కోసం వీడియో పోస్టు చేయడంతో అతడి ఇంటికి పోలీసులు వచ్చారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... రెడ్లాన్ రోహిత్ అనే యువకుడు తాను ఆత్మహత్య చేసుకుంటున్నంటూ వీడియో రూపొందించి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రోహిత్ ఇంటికి చేరుకున్నారు. తాను కేవలం వ్యూస్, లైక్ ల కోసమే ఈ వీడియో తీశానని చెప్పాడు. కానీ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.