TTTTTodayTeluguGlobal Telugu. Powered from the USA
Advertisement
TodayTelangana

Telangana

25203 articles

నర్సు హత్యాచార ఘటనపై మెజిస్టీరియల్ విచారణ
Telangana

నర్సు హత్యాచార ఘటనపై మెజిస్టీరియల్ విచారణ

ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా బాధితురాలి కుటుంబానికి న్యాయం దర్యాప్తులో జాప్యం వద్దు.. నిరంతరం పర్యవేక్షించండి పోలీస్ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశంమన తెలంగాణ/హైదరాబాద్: నగర శివార్లలోని తుక్కుగూడలో ప్రైవేట్ ఆసుపత్రి నర్సు హత్యాచారానికి గురైన దారుణ ఘటనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్రంగా మేజిస్టీరియల్ విచారణ జరిపించాలని అధికారులను ఆయన ఆదేశించారు. విచారణలో భాగంగా బాధితురాలు ఉంటున్న వసతి ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సంబంధిత సంస్థ నిర్వహణలో ఏవైనా నిర్లక్ష్యాలు ఉన్నాయా, మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించిన నిబంధనలు సక్రమంగా అమలయ్యాయా తదితర అంశాలన్నింటినీ నిశితంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో, దర్యాప్తును అత్యంత పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. ఫోరెన్సిక్ నివేదికలు, ఇతర సాంకేతిక ఆధారాల సేకరణను శరవేగంగా పూర్తి చేసి, సమగ్ర ఛార్జ్‌షీట్ దాఖలు చేసేలా పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసును నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. బాధిత కుట

Adminabout 5 hours ago👁 0
సొమవారం రాశి ఫలాలు  (07-09-2026)
Telangana

సొమవారం రాశి ఫలాలు (07-09-2026)

మేషందూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమౌతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృషభం ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. దైవ చింతన పెరుగుతుంది. మిధునం శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటకం నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు అందరికి నచ్చే విధంగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

పశువుల పాకలోనే పాఠశాల.. అక్కడే తిండి, నిద్ర.. కర్ణాటకలో ఐదేళ్లుగా ఓ స్కూల్ దుస్థితి ఇది...
జేఎన్‌యూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు!
Telangana

జేఎన్‌యూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు!

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై 10 మంది విద్యార్థినులు విశ్వవిద్యాలయ అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)కి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులు మేలో అందినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. విచారణ కొనసాగుతోంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ పేరును ఇప్పటివరకు వెల్లడించలేదు.ఫిర్యాదుల ప్రకారం.. సదరు ప్రొఫెసర్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశాలకు విద్యార్థినులను ఆహ్వానించేవారని, అక్కడ వారితో అనుచితంగా ప్రవర్తించేవారని ఆరోపణలు ఉన్నాయి. తరగతి గదుల్లోనూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు విద్యార్థినులు ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఒక విద్యార్థిని తనకు ఎదురైన అనుభవాన్ని మే రెండో వారంలో విద్యార్థుల అనధికారిక వాట్సాప్ గ్రూపులో పంచుకోవడంతో.. మరికొందరు విద్యార్థినులు కూడా ఇలాంటి ఆరోపణలతో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. మే మొదటి వారంలో జరిగిన మౌఖిక పరీక్షల (వైవా) సందర్భంగా ప్రొఫెసర్ లైంగిక భావజాలంతో కూడిన అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. విద్యార్థినులు తన లైంగిక ప్రతి

ఏపీలోని నరసరావుపేటలో వింత ఘటన.. మహిళ కడుపులో 14 పెన్నులు !
మేనరికపు పెళ్లిళ్లపై వాస్తవాలు వెలుగులోకి.. అలా పెళ్లిళ్లు చేసుకోవచ్చా..? లేదా..?
సరిహద్దులో బంగ్లా జాతీయుడి అరెస్టు.. రూ.17 కోట్ల గోల్డ్ బిస్కట్లు స్వాధీనం
Telangana

సరిహద్దులో బంగ్లా జాతీయుడి అరెస్టు.. రూ.17 కోట్ల గోల్డ్ బిస్కట్లు స్వాధీనం

ఖాట్మండూ: పశ్చిమ బెంగాల్‌లోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) పెట్రోలింగ్ బృందం ఒక బంగ్లాదేశ్ జాతీయుడిని అరెస్టు చేసింది. అతని వద్ద నుంచి రూ.17.40 కోట్ల విలువైన స్మగుల్ బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుంది. నదియా జిల్లాలోని హల్దార్‌పోరా పోస్టు సమీపంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో బిఎస్‌ఎఫ్ 32వ బెటాలియన్ భద్రతా విధులు నిర్వహిస్తోంది. బంగ్లాదేశ్ జాతీయుడి నుంచి 89 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నామని, వాటి బరువు 11.28 కిలోలకు పైగా ఉందని అధికారులు చెప్పారు. తదుపరి దర్యాప్తు కోసం నిందితుడిని బీఎస్‌ఎఫ్ అధికారులు డెరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు అప్పగించినట్టు తెలిపారు. అధికారిక గణాంకాల ప్రకారం, సరిహద్దు నేరాలకు అరికట్టెందుకు ఈ బెటాలియన్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. 2023 ఆగస్టు నుంచి ఇంతవరకూ 120 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దీని విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుంది.

తుక్కుగూడలో నర్సు హత్యాచార ఘటనపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
ఇరాన్‌లో ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి
Telangana

ఇరాన్‌లో ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి

టెహ్రాన్: పశ్చిమ ఇరాన్‌లో ఇంధన ట్యాంకర్ పేలిపోవడంతో 11 మంది మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఐఆర్‌ఎన్‌ఎ తెలిపింది. కుర్దిష్ నగరమైన సనందజ్ సమీపంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట శనివారంనాడు ఈ ప్రమాదం జరిగినట్టు పేర్కొంది. ట్యాంకర్ తొలుత కొన్ని కార్లను ఢీకొన్ని అనంతరం మంటల్లో చిక్కుకుని పేలిపోయినట్టు తెలిపింది. బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పేర్కొంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించింది. 2018లోనూ సనందజ్ సమీపంలో ఇంధన ట్యాంకరు, ఇంటర్‌సిటీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో 15 మంది మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఇరాన్‌లో రోడ్డు, ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా ఏటా 17,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. భద్రతా ప్రమాణాలు లేని వాహనాలు, ట్రిఫిక్ నిబంధనలను పట్టించుకోకపోవడం, అత్యవసర సేవలు తగినంతగా అందుబాటులో లేకపోవడం వంటివి అధిక మరణాలకు కారణంగా నిపుణులు ఆరోపిస్తున్నారు.

బాచుపల్లిలో కారుకు నిప్పంటించిన రియల్టర్ అరెస్ట్
అమెరికాలో భారీ మోసం.. భారతీయుడు అరెస్ట్
Telangana

అమెరికాలో భారీ మోసం.. భారతీయుడు అరెస్ట్

వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ పథకాల్లో భారీ మోసానికి పాల్పడిన భారత సంతతికి చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్టయ్యాడు. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ డెరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించారు. భారత్‌కు చెందిన మంజీత్ సింగ్ బేడీ అమెరికా ప్రభుత్వానికి దాదాపు 6 లక్షల డాలర్ల మేరకు నష్టం కలిగించాడని, అతనిపై 1.5 లక్షల డాలర్ల రివార్డు ఉందని పటేల్ తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్ కమిషనరేట్ పరిధిలో అరెస్టయిన అతనిని అమెరికా తీసుకెళ్లేందుకు ఎఫ్‌బిఐ చర్యలు చేపడుతోందని వెల్లడించారు.ఎఫ్‌బీఐ వివరాల ప్రకారం, వాషింగ్టన్‌లోని టాకోమాలో బేడీ చిన్న కిరాణా దుకాణం నిర్వహించేవాడు. ప్రభుత్వ ఆహార సహాయ పథకం ‘స్నాప్’ లబ్ధిదారుల ఈబీటీ కార్డులను స్త్వ్రప్ చేసి ఆహార పదార్ధాలు ఇవ్వకుండా నగదు అందించేవాడు. వచ్చిన మొత్తంలో సగం తనవద్దే ఉంచుకునేవాడు. మార్చి 2024, జూన్ 2025 మధ్య ఈ మోసానికి పాల్పడ్డాడు. దీంతో ‘స్నాప్’ బెనిఫిట్ ఫ్రాడ్ కింద అరెస్టు చేయకుండా కోర్టుకు హాజరయ్యేందుకు ఆయనను అనుమతించారు. కేసు విచారణ సందర్భంగా పాస్‌పోర్టును అప్పగించి వాషింగ్టన్ దాటి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కెనడాకు, అక్కడ్నించ

వెంటనే హస్తినకు రండి.. సిఎం రేవంత్‌కు అధిష్టానం పిలుపు
Telangana

వెంటనే హస్తినకు రండి.. సిఎం రేవంత్‌కు అధిష్టానం పిలుపు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హుటాహుటిన హస్తినకు రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. అయితే సోమవారం నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభంకానున్నందున, సమావేశాలు వాయిదా పడిన తర్వాత ఢిల్లీకి వెళ్ళేందుకు ఆయన సమాయత్తమవుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఢిల్లీకి రావాల్సిందిగా ముఖ్యమంత్రికి అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఈ ఊహగానాలు మరింత బలపడుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అధిష్టానం చర్చలు జరపనున్నది. ఇంకా మంత్రివర్గ విస్తరణ విషయంలో చర్చించే అవకాశం ఉంది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసి పెండింగ్ పనుల విషయంలో చర్చించి, ఆ మర్నాడు హైదరాబాద్‌కు చేరుకుంటారని తెలుస్తోంది.

ఫ్యూచర్ సిటీ పేరుతో అవినీతి తతంగం: కెసిఆర్
Telangana

ఫ్యూచర్ సిటీ పేరుతో అవినీతి తతంగం: కెసిఆర్

హైదరాబాద్: ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన ఫార్మా ఇండస్ట్రీని పెద్ద ఎత్తున నెలకొల్పేందుకు నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫార్మాసిటీని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల భూములను రియల్ ఎస్టేట్ దందా కోసం ఉపయోగించుకునే విధంగా ఫ్యూచర్ సిటీ పేరుతో అత్యంత దుర్మార్గమైన అవినీతి తతంగానికి తెరలేపిందని కెసిఆర్ దుయ్యబట్టారు. ఈ సమస్యమీద ఉభయ సభల్లో ప్రశ్నించాలన్నారు. తెలంగాణ సిరుల వెలుగు సింగరేణి గనుల్లో అవినీతి పెచ్చు మీరిందని, సింగరేణి కుంభకోణాలకు నెలవుగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై ఉభయసభల్లో పార్టీ సభ్యులు ప్రశ్నించాలని దిశానిర్ధేశం చేశారు. ప్రభుత్వ భూములను భవిష్యత్తు తరాల అవసరాలకు ఏమాత్రం మిగిల్చకుండా, తమ ఇష్టా రీతిన అక్రమ అమ్మకాలు చేపడుతున్న ప్రభుత్వ చర్యలను నిలదీయాలని చెప్పారు. సజావుగా నడుస్తున్న మెట్రో రైలు నిర్వహణను అనాలోచిత విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం తన చేతిలోకి తీసుకున్నదని, తద్వారా రాష్ట్ర ఖజానాపై విపరీతమైన భారాన్ని పోపడమే కాకుండా నిర్వహణ చేతగాని పరిస్థితిలోకి నెట్టివేయబడిందని పేర్కొన్నారు. ఇటువంటి నిర్ణయాల మీద ఉభయ సభల్లో ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని

శ్రీవారి మెట్టుమార్గంలో కారు ప్రమాదం.. హైదరాబాద్ భక్తులకు గాయాలు
Telangana

శ్రీవారి మెట్టుమార్గంలో కారు ప్రమాదం.. హైదరాబాద్ భక్తులకు గాయాలు

మన తెలంగాణ/హైదరాబాద్: శ్రీనివాసమంగాపురంలోని శ్రీవారిమెట్టు మార్గంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌ వాసులకు గాయాలయ్యాయి. ఓ ప్రైవేటు కారు అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చంద్రగిరి పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కారు ముందు భాగం ధ్వంసంకాగా.. కారులో ఉన్న చింతల్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కలవాళ్లు గమనించి..గాయపడిన వారిని కారులోంచి బయటకు తీసి.. అంబులెన్సులో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారు శ్రీవారిమెట్టు మార్గం ద్వారా తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వినాయకుడి దర్శనం కోసం కారులో బయలుదేరగా.. ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

గౌరవం లేని సభకు కెసిఆర్ రావాల్సిన అవసరం లేదని మేమే నిర్ణయించాం..
Telangana

గౌరవం లేని సభకు కెసిఆర్ రావాల్సిన అవసరం లేదని మేమే నిర్ణయించాం..

హైదరాబాద్: అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి వాడుతున్న భాష బజారు భాషను తలపిస్తోందని హరీష్‌రావు మండిపడ్డారు. బడ్వే, పైల్వాన్.. బట్టలిప్పి కొడతాడు, తిర్రేసి కొడతాడు అని అసెంబ్లీలో మాట్లాడటం చూసి సభ్యసమాజం తలదించుకుంటోందని అన్నారు. అలాంటి గౌరవం లేని సభకు కెసిఆర్ వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ చిల్లర ముఖ్యమంత్రితో చర్చల్లో పాల్గొనాల్సిన అవసరం కెసిఆర్‌కు లేదు అని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు అందరం ఏకగ్రీవంగా నిర్ణయించామని వెల్లడించారు. కెసిఆర్ తయారు చేసిన సైనికులం తామున్నామని తెలిపారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు, రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన కెసిఆర్ భద్రత మీద రేవంత్ రెడ్డికి ఏడుపెందుకు..? అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం ఎపిలో మాజీ ముఖ్యమంత్రులకు భద్రత కల్పించడం లేదా..? అని అడిగారు. కనీసం వార్డు మెంబర్ కూడా కాని సిఎం తమ్ముడు తిరుపతి రెడ్డికి నలుగురు గన్‌మెన్లు పెట్టి, భద్రత కోసం రూ.40 కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నావో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చరిత్రలో ఎంజీఆర్, జయలలిత, కరుణాన

మెట్రోరైలు, ఆర్టీసీ ఉమ్మడి పాస్‌లు వెంటనే జారీ చేయండి: సిఎస్
Telangana

మెట్రోరైలు, ఆర్టీసీ ఉమ్మడి పాస్‌లు వెంటనే జారీ చేయండి: సిఎస్

మన తెలంగాణ/హైదరాబాద్: మెట్రో రైల్, ఆర్టీసీ బస్సు ప్రయాణానికి ఉమ్మడి రోజువారీ, నెలవారీ పాస్‌లను వెంటనే ప్రవేశపెట్టాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. బేగంపేట్ మెట్రో రైల్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదివారం హెచ్‌ఎంఆర్‌ఎల్, టీజీఎస్‌ఆర్టీసీ, విద్యుత్ శాఖ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్స్ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మెట్రో, ఆర్టీసీ ప్రయాణీకులకు ఉమ్మడి పాస్ జారీ చేయడానికి సాంకేతిక పరంగా సిద్ధంగా ఉన్నామని.. ఏ రోజైనఅమలు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్, ఆర్టీసీ అధికారులు సీఎస్‌కు స్పష్టం చేశారు. ఉమ్మడి చార్జీలను త్వరితగతిన ఖరారు చేసి వెంటనే పాస్‌ల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఇప్పటి వరకు మెట్రో మొదటి, రెండో దశల్లో చేపట్టిన వివిధ పనులపై సంజయ్ జాజుకు హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ అజిత్ రెడ్డి, జాయింట్ ఎండీ శివేంద్ర ప్రతాప్ వివరించారు. పాతబస్తీలో 7.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ కోసం రోడ్ విస్తరణ పనుల తాజా స్థితిగతులను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. విస్తరణ పనులు

ఛలో హైదరాబాద్ విరమించండి.. ఉద్యోగ సంఘాలతో భట్టి
Telangana

ఛలో హైదరాబాద్ విరమించండి.. ఉద్యోగ సంఘాలతో భట్టి

మన తెలంగాణ/హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన ఛలో హైదరాబాద్ కార్యాక్రమానికి ఉద్యోగ సఘాల జెఏసి నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ప్రజాభవన్‌లో ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు ప్రధాన డిమాండ్లు అయిన సిపిఎస్ రద్దు, పిఆర్‌సిలు, ఇహెచ్‌ఎస్, పెండింగ్ డిఏలతో పాటు పలు డిమాండ్లను భట్టి దృష్టికి మరోసారి తీసుకెళ్లారు.దీనిపై భట్టి స్పందిస్తూ.. సిపిఎస్ రద్దు విషయంలో ఇటీవల కాలంలో ఆంధ్రప్రధేశ్ రాష్ట్రం అవలంభించిన విధానంలో చేస్తామని తెలిపారు. పిఆర్‌సిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, పెండింగ్ డిఏలను ప్రకటిస్తామని చెప్పారు. ఉద్యోగ సంఘాలు తలపెట్టిన కార్యాక్రమాన్ని విరమించుకోవాలని డిప్యూటీ సిఎం కోరారు. దీనిపై ఉద్యోగ సంఘాల నేతల స్పందిస్తూ తమ డిమాండ్లను ఏవిధంగా పరిష్కరిస్తారో స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరారు. అప్పటి వరకు తమ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అసంపూర్తిగా చర్చలు ముగియడంతో ఉద్యోగ సంఘాలు ఈ నెల 10వ తేదీన చేపట్టనున్న ఛలో హైదరాబాద్, భవిష్యత్ కార్యచరణపై మరోసారి సమావేశం కానున్నట్లు జె

రూ. 6 లక్షలు గోల్డ్ లోన్ తీసుకొని.. తిరిగి చెల్లించమంటే... ఫైనాన్స్ సంస్థ మేనేజర్ నే చంపేశారు..!
లండన్ వెళ్లాల్సిన విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Telangana

లండన్ వెళ్లాల్సిన విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

బెంగళూరు: సుమారు 270 మంది ప్రయాణికులతో లండన్‌కు బయలుదేరిన వర్జిన్ అట్లాంటిక్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వెనక్కి తిరిగి వచ్చింది. ఈ ఘటన బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. షెడ్యుల్ ప్రకారం విమానం ఆదివారం ఉదయం 8.20 గంటలకు లండన్‌కు బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్టు పైలట్ గుర్తించి విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు. విమానాన్ని అరగంట సేపు గాలిలో చక్కర్లు కొట్టించిన అనంతరం వినానాన్ని వెనక్కి తీసుకువచ్చి కెంపెగౌడ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ తెలిపింది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ఏమినేది వెంటనే తెలియలేదు. ప్రస్తుతం విమానాన్ని తనిఖీలకు తరలించి దర్యాప్తు చేపట్టారు.

గుహను వీడిన సింహం కూన.. మైత్రీ బ్యానర్లో మోక్షజ్ఞ సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..
రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కొరకు ప్లకార్డుల ప్రదర్శన
Telangana

రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కొరకు ప్లకార్డుల ప్రదర్శన

నవతెలంగాణ-ఆలేరు టౌనుఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆలేర్ పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు, సోమవారం నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలలో ఆలేరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, గెజిట్ నోట్ ప్రకటించాలని కోరుతూ, సభ్యులు ప్లే కార్డులు ప్రదర్శించనున్నారు. ప్లే కార్డుల ప్రదర్శన కార్యక్రమం సభ్యులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని, రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం ఆదివారం విలేకరులకు ఒక ప్రకటనలో తెలియజేశారు. The post రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కొరకు ప్లకార్డుల ప్రదర్శన appeared first on Navatelangana.

ఢిల్లీలో బాయ్స్ హాస్టల్ భవనం కూలిన ఘటనలో ముగ్గురు మృతి.. రంగంలోకి అమిత్ షా
ట్యాంక్ బండ్‎పై మంత్రి పొన్నం, ఎమ్మెల్యే దానం మాస్ డ్యాన్స్
మండలంలో ఘనంగా బోనాల పండుగ
Telangana

మండలంలో ఘనంగా బోనాల పండుగ

నవతెలంగాణ-మర్రిగూడ మండలంలోని పలు గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచ్ ఆధ్వర్యంలో ఆదివారం ముత్యాలమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.గ్రామాలలోని మహిళలు బోనాలను అందంగా అలంకరించుకొని అమ్మవారికి బోనాలను సమర్పించారు. డప్పు చప్పుళ్ళు,శివసత్తుల శిగాలు,డీజే పాటలు,పోతురాజుల విన్యాసాలతో గ్రామాలలో సందడి వాతావరణం నెలకొన్నది. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు సమర్పించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు,ఉప సర్పంచ్ లు,పాలకవర్గం సభ్యులు,గ్రామ పెద్దలు,మహిళలు,యువకులు,తదితరులు పాల్గొన్నారు. The post మండలంలో ఘనంగా బోనాల పండుగ appeared first on Navatelangana.

1 / 1051Next →