తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య, నటి ప్రియా మోహన్ పండంటి ఆడబిడ్డ జన్మించింది. జవాన్ మూవీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అట్లీ, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో మరో మధుర క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 2023లో వీరికి కుమారుడు మీర్ జన్మించగా, ఇప్పుడు అతనికి చెల్లి వచ్చినట్లు అట్లీ ఒక స్పెషల్ పోస్టర్‌ను X లో షేర్ చేశారు. దీంతో ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అట్లీ.. అల్లు అర్జున్‌తో ‘రాకా’ సినిమా తీస్తున్నారు.
BREAKING
మరోసారి తండ్రయిన స్టార్ డైరెక్టర్

Related News
Comments
Login to leave a comment

