ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సూపర్ గుడ్న్యూస్.. స్థలం లేని వారికి డబుల్బెడ్రూమ్ల కేటాయింపు

Telangana Indiramma L2 beneficiaries: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తీసుకొచ్చిన ఇందిరమ్మ పథకం విషయంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో మొదలుపెట్టి పూర్తి చేయకుండా వదిలేసిన సుమారు 8వేలకు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలోని ఎల్-2 లబ్ధిదారులకు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసంపూర్తిగా ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించి వాటిని పూర్తి చేసుకునేందుకు కవాల్సిన నిధులను కేటాయించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Related News
Comments
Login to leave a comment















