గుంటూరులో మైనర్ బాలికను మాయమాటలతో వలలోకి దించి వ్యభిచారంలోకి దించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికను వేధించిన మహిళతో పాటు మరో మహిళ, ముగ్గురు యువకుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద ముఠా ఉందా? మహిళల అక్రమ రవాణాతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు.