టాలీవుడ్‌లో ఇప్పుడు స్టార్ హీరోలకే కాదు, మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా వందల కోట్ల బడ్జెట్లు కేటాయిస్తున్నారు. ‘వృషకర్మ’, ‘సంబరాల ఏటిగట్టు’, ‘నాగబంధం’ వంటి చిత్రాలు భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ మేకింగ్‌తో రూపొందుతున్నాయి. హీరోల మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్న నిర్మాతలు కంటెంట్, విజువల్ ఎక్స్‌పీరియన్స్‌పైనే నమ్మకం పెట్టుకుని భారీ రిస్క్ తీసుకుంటున్నారు.