May07 Gold Price: భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు పండగలు, శుభకార్యాలు సహా ఇతర వేడుకల సమయంలో బంగారు ఆభరణాల్ని ఎక్కువగా కొనుగోలు చేసి ధరిస్తుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తున్నందున చాలా మంది బంగారం కొనేందుకు చూస్తున్నారు. మీరు కూడా గోల్డ్‌ కొనాలనుకుంటున్నారా..? అయితే, మీకో అలర్ట్‌.. కిందటి రోజుతో పోలిస్తే బంగారం ధర మళ్లీ పెరిగింది. వెండి ధర కూడా ఎగబాకింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు స్వల్పంగా తగ్గినా.. బంగారం, వెండి ధరలు పెరగడం గమనార్హం. ఇవాళ ఉదయం 7.30 గంటల సమయంలో రేట్లు ఇలా ఉన్నాయి.