విజయ్ తలపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా హీరోగా అలరించిన ఆయన ఇప్పుడు ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సొంతంగా రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఆయన.. ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక సీట్లు సంపాదించిన మెజారిటీ పార్టీగా అవతరించి సరికొత్త చరిత్ర సృష్టించింది.