
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ వివో తన కొత్త 5G ఫోన్‌ను లాంచ్ చేసింది. కంపెనీ చైనాలో ఈ పరికరాన్ని 'వివో Y60' పేరిట సైలెంట్ గా విడుదల చేసింది. వివో ఇప్పటికే మార్కెట్లో వివో Y600 ప్రోను విడుదల చేయగా, తాజాగా ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. మూడు రంగులు, మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ పరికరం ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వివో Y60 ధర, లభ్యత
ధర విషయానికి వస్తే, 6GB + 128GB స్టోరేజ్‌తో కూడిన బేస్ వేరియంట్ ధర CNY 1,799 (సుమారుగా రూ. 25,000). అలాగే 6GB + 256GB వేరియంట్ ధర CNY 1,999 (సుమారుగా రూ. 28,000). ఈ ఫోన్ 8GB + 256GB వేరియంట్ ధర CNY 2,299 (సుమారుగా రూ. 32,000).
వివో Y60 ఫీచర్లు
ఈ వివో ఫోన్‌లో 6.74-అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్‌కు 4nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్ శక్తిని అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS 6 పై పనిచేస్తుంది. ఇందులో అడ్రినో 613 GPU, 8GB వరకు LPDDR4x RAM, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్‌తో వస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం, ఈ ఫోన్‌లో వెనుకవైపు CMOS సెన్సార్, ఆటోఫోకస్, 10x వరకు డిజిటల్ జూమ్‌తో కూడిన 13-మెగాపిక్సెల్ (f/2.2) ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం, ఈ ఫోన్‌లో 5-మెగాపిక్సెల్ (f/2.2) ఫ్రంట్ కెమెరా ఉంది. అదనంగా, ఈ ఫోన్‌లో 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీ ఉంది.












