
ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే కుప్పకూలింది. రజడా, హోల్డర్ మూడేసి వికెట్లు తీసి గుజరాత్‌ను గెలిపించారు. హైదరాబాద్ టీమ్‌లో కమిన్స్ (19) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు గుజరాత్‌ను ఓపెనర్ సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్‌లు అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నారు.
ఇద్దరు హైదరాబాద్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన సాయి సుదర్శన్ 44 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక వాషింగ్టన్ అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సుందర్ 33 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో సాకిబ్, ప్రఫుల్ హింగె రెండేసి వికెట్లను పడగొట్టారు.













