
చెన్నై: ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మూడు పథకాలను ప్రకటించారు. ఉచిత విద్యుత్, మహిళా భద్రత, డ్రగ్స్ నిరోధక చర్యల పథకాలను తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ పథకాలతో కూడిన ఫైలుపైనే విజయ్ తొలి సంతకం చేశారు. గృహ విద్యుత్ వినియోగదారులకు రెండు నెలల్లో వారు వాడే 500కు పైగా యూనిట్ల విద్యుత్‌లో 200 యూనిట్ల వరకూ ఎటువంటి బిల్లు లేకుండా చేశారు.
రాష్ట్రంలో మహిళలు భద్రతాయుతంగా తిరిగేందుకు సింగ పెన్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి మహిళల భద్రతకు తగు ఏర్పాట్ల అధునాతన సాంకేతిక పరికరాలు, అవసరం అయిన సిబ్బంది ఉంటుం సింగపెన్ అంటే తమిళంలో సివంగి అనే అర్థం ఉంది. మాదకద్రవ్యాల ఆటకట్టుకు 65 యాంటి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. డ్రగ్స్ ప్రవేశం, రవాణా, వాడకానికి ఈ బృందాలు ఎక్కడికక్కడ చెక్ పెడుతాయి.















