
మహారాష్ట్రలోని అమ్రావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో ఘార అగ్నిప్రమాదం జరిగింది. స్పెషల్ న్యూబోర్న్ యూనిట్ (ఎస్‌ఎన్‌సీయూ)లో సోమవారం తెల్లవారుజాము 3.30 గంటల ప్రాతంలో జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు సజీవదహనమయ్యారు. ఆసుపత్రి మూడో అంతస్తులో ఉన్న ఎన్‌ఐసీయూ విభాగంలోని వెంటలేటర్ ఒక్కసారిగా పేలడంతో మండలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో ఆసుపత్రిలో 39 మంది నవజాత శిశువులు ఉన్నారు. అప్రమత్తమైన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది వెంటనే పసికందులను సురక్షిత ప్రాంతానికి
తరలించి సహాయక చర్యలు చేపట్టారు. వీరిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం సూపర్ స్పెషలాటీ అసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన, ముగ్గురు నవజాతశిశువులు కన్నుమూయడంపై మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి, నాగపూర్, అమ్రావతి జిల్లాల గార్డియన్ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు చెప్పారు.











