
మన తెలంగాణ/నిజామాబాద్ క్రైమ్/హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లా రెడ్డి మంగళవారం ఎసిబి వలకు చిక్కారు. ఆదా యానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఎసిబి అధికారులు నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్, న ల్గొండ జిల్లాల్లో 11 చోట్ల మెరుపు దాడులు ని ర్వహించారు. నిజామాబాద్ పట్టణంలోని సు భాష్‌నగర్‌లో ఉన్న ఎక్సైజ్ కార్యాలయంలో, అ క్కడ ప్రగతినగర్‌లోని మల్లారెడ్డి నివాసం, అలా గే హైదరాబాద్ మచ్చబొల్లారంలోని ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కూడా ఏకకాలంలో దాడులు జ రిగాయి. ఈ సోదాల సందర్భంగా ఎసిబి అధికారులు ఎక్సైజ్ శాఖ కార్యాలయం నుంచి ప లు పత్రాలను స్వాధీనం చేసుకోగా, అధికారి ని వాసం నుంచి రికార్డులు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు, అక్రమ ఆస్తుల చిట్టా బయటపడటంతో మల్లారెడ్డిని ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలించి,
నాంపల్లి ఎసిబి కోర్టులో హాజరు పర్చగా, జడ్జి ఆయనకు రిమాండ్ విధించారు. ఎసిబి సోదాల్లో బయటపడ్డ ఆస్తులు అధికారిక అంచనాల ప్రకారం రూ. 3 కోట్లు కాగా మార్కెట్ విలువ మూడింతలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎసిబికి చిక్కిన పత్రాల ప్రకారం 4 నివాస గృహాలు, ఒక వాణిజ్య భవనం. 8 ఖాళీ స్థలాలు, 10.23 ఎకరాల వ్యవసా య భూమి ఉన్నట్టు గుర్తించారు. వీటితో పాటు రూ. 3.31 లక్షల నగదు, రూ. 50 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న 3 బ్యాంకు లాకర్లను గుర్తించి వాటిని సీజ్ చేశారు. ఖరీదైన గ్రాండ్ విటారా కారు, టీవీఎస్ స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఉండగా, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పాల్పడిన అక్రమ లావాదేవీలన్నీ ఒక రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ ద్వారా జరిగినట్టు సమాచారం. సదరు కానిస్టేబుల్ ఇంటిపై దాడులు నిర్వ హిస్తే, మల్లారెడ్డికి సంబంధించిన మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని ఎక్సైజ్ వర్గాలు ఎసిబి అధికారులకు సూచించినట్టు సమాచారం.
మామూళ్ల వసూళ్లే కొంపముంచాయా?
గతంలో వైన్ షాపుల టెండర్లు, లైసెన్సుల మంజూరు సమయంలో భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎసిబి రాష్ట్ర వ్యాప్త తనిఖీల నేపథ్యంలో కొంత కాలం నిలిపివేసిన వసూళ్లను, ఇటీవల మళ్ళీ ప్రారంభించినట్లు సమాచారం. నెలవారీ మామూళ్లతో పాటు, లైసెన్సు దారుల నుంచి ఒక్కొక్కరి దగ్గర రూ. 1.20 లక్షల చొప్పున వసూలు చేసిన మొత్తాన్ని పంచుకునే విషయంలో ఎక్సైజ్ శాఖలో సిబ్బంది మధ్య తలెత్తిన విభేదాలు, చివరకు రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి వెళ్లడమే ఈ దాడులకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు ఇప్పుడు జిల్లా ఎక్సైజ్ శాఖలో తీవ్రస్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.












