
పైరసీ భూతం టాలీవుడ్‌ను వీడటం లేదు. ఒకవైపు డిజిటల్ విప్లవం, మరోవైపు పైరసీ సైట్ల దాడితో కుదేలవు తున్న టాలీవుడ్‌కు ’ఐబొమ్మ’ రూపంలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సైట్ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి అరెస్ట్ కావడంతో ఇక ఐబొమ్మ అధ్యాయం ముగిసిందని అంతా భావించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా రవి బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే ఆన్లైన్లో మళ్లీ ఈ సైట్ ప్రత్యక్షమవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. యాక్టివిటీ లేని ఈ వెబ్ సైట్ నుంచి ఇప్పుడు మళ్లీ వరుసగా కొత్త సినిమాలు రావడం మొదలైంది. థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలైన గంటల్లోనే వెబ్ సైట్లో ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇప్పుడు ఈ ఐ బొమ్మ వెబ్ సైట్ ను మళ్లీ ఎవరు మొదలు పెట్టారు? అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. గతంలో ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు పైరసీకి అడ్డుకట్ట పడుతుందని నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు.
అప్ప ట్లో సైట్ పూర్తిగా నిలిచిపోయింది. అయితే, తాజాగా వెబ్సైట్ పునరుద్ధరించబడటమే కాకుండా, థియేటర్లలో ఉన్న కొత్త సినిమాలు సైతం అందు లో ప్రత్యక్షమవ్వడం పట్ల సినీ పెద్దలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రవి బెయిల్‌పై రావడం, వెంటనే సైట్ ఆపరేషన్లు మొదలవ్వడం వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది. సాంకేతికతను వాడుకుంటూ డొమైన్లను మారుస్తూ వస్తున్న ఈ పైరసీ ముఠాను అరి కట్టడంలో ఎక్కడ లోపం జరుగుతుందనే చర్చ మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు, యాంటీ పైరసీ సెల్ అప్రమ త్తమయ్యారు. సినిమా షూటింగ్ కోసం ఎంతో మంది కార్మికులు, పెట్టుబడిదారులు పడే కష్టాన్ని ఈ పైరసీ వెబ్సైట్లు అడ్డంగా దోచుకుంటున్నా యని టాలీవుడ్ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకుల్లో అవగాహన పెరగాలని, పైరసీని ప్రోత్సహించకుండా థియేటర్లలోనే సినిమా లు చూడాలని సినీ ఇండస్ట్రీ విజ్ఞప్తి చేస్తోంది. ఐబొమ్మ వంటి సైట్ల వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను శాశ్వతంగా రూపుమాపేందుకు కఠిన చర్యలు తీసుకో వాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.













