చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్ జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత రెండు మ్యాచుల్లో విజయం సాధించి జోష్‌ మీదున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. మరోవైపు గత మ్యాచ్‌లో ఆర్‌సిబిని చిత్తు చేసిన ఎల్‌ఎస్‌జి ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా చెన్నై బరిలో దిగుతుండగా.. ఎల్‌ఎస్‌జి రెండు మార్పులు చేసింది. జోష్ ఇంగ్లిస్, ఆవేశ్ ఖాన్‌లను జట్టులోకి తీసుకుంది.

తుది జట్లు:

సిఎస్‌కె: సంజు శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డేవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబె, జెమీ ఓవర్‌టన్, అకీల్ హొసేన్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేశ్ చౌదరీ.

ఎల్‌ఎస్‌జి: మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్/కీపర్), ఐడెన్ మార్క్‌రమ్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షహబాజ్ అహ్మద్, మహ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠి, ప్రిన్స్ యాదవ్.