
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) వన్డే వార్షిక ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఇందులో 118 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 113 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానం, 109 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానం దక్కించుకున్నాయి. ఇక 102 పాయింట్లతో పాకిస్థాన్ (95)ను అధిగమించి సౌతాఫ్రికా టాప్-4లోకి వచ్చేసింది. శ్రీలంక 96 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా.. అఫ్గానిస్తాన్ (93), ఇంగ్లండ్ (89), బంగ్లాదేశ్ (84), వెస్టిండీస్ (74) పాయింట్లతో ఆ తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. ఐసిసి నిబంధనల ప్రకారం గత మూడేళ్లలో జరిగిన మ్యాచ్‌ల ఫలితాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ను వెల్లడించారు. మే 2025 నుంచి జరిగిన మ్యాచ్‌లకు 100 శాతం, అంతకు ముందు రెండేళ్ల మ్యాచ్‌లకు 50 శాతం పాయింట్ల వేయిటేజీని ఇచ్చారు.















