అక్రమ సంబంధం వేధింపులతో యువకుడు ఆత్మహత్య  చేసుకున్న సంఘటన  వికారాబాద్ జిల్లా ల ో చోటుచేసుకుంది. జిల్లాలోని కోకట్ గ్రామంలో గాండ్ల శివకుమార్ (31) అనే వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాణెమ్మ అనే వివాహిత తనతో అక్రమ సంబంధం కొనసాగించాలని, లేదంటే పరువు తీస్తానని బెదిరించడం వల్లే తన భర్త చనిపోయాడని భార్య చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక  ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.