
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల ఎంఆర్ఓ దిలీప్ నాయక్ రూ.70 వేల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భూ సంబంధిత ప ని చేసిపెట్టేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.70 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తున్నది. ఫిర్యాదుదారుడి సమాచారంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏసీబీ అధికారులు వల పన్ని, లంచం స్వీకరిస్తున్న సమయం లో దిలీప్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అధికారు లు నగదు స్వాధీనం చేసుకొని, సం బంధిత కార్యాలయంలో తనిఖీలు ని ర్వహించారు. కేసు నమోదు చేసి ద ర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని వివరా లు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.










