
చార్మింగ్ స్టార్ శర్వా... డైరెక్టర్ సంపత్ నందితో కలిసి చేస్తున్న భారీ పాన్ -ఇండియా పీరియడ్ యాక్షన్ సాగా ’భోగి’. ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మాణంలో, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్న ఈ చిత్రం, శర్వా కెరీర్లో అత్యంత భారీ స్థాయి వెంచర్లలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. చిత్ర నిర్మాతలు డింపుల్ హయాతి పాత్ర లుక్‌ను రిలీజ్ చేశారు. డింపుల్ హయతి ఈ చిత్రంలో ‘మందారం’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆమె ఎర్ర చీరలో బోల్డ్ అండ్ స్టన్నింగ్ లుక్‌లో ఆకట్టుకున్నారు.
చేతిలో విసనకర్ర పట్టుకుని, ఇంటెన్స్ హావభావాలతో కనిపిస్తున్న ఆమె లుక్ 1960ల కాలాన్ని ప్రతిబింబించేలా ఉంది. ఇటీవల చిత్ర యూనిట్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించింది. హైదరాబాద్‌లో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో 1960ల కాలాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్ నిర్మించి షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘భోగి’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.















