
కారు బైక్ ను ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందిన విషాధ ఘటన గుర్రంపోడు మండలం చేపూరు ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చింతగూడెంకు చెందిన మారెడ్డి బాల్‌రెడ్డి (70) , భార్య అలివేలమ్మ, పాల్వాయి గ్రామానికి చెందిన మాలె, వెంకటమ్మ, మాలె మంజుల కారులో నల్లగొండలో తమ సమీప బంధువుల నిశ్చితార్థ వేడుకకు హాజరై తిరిగి స్వస్థలానికి వెళుతున్న క్రమంలో కనగల్ మండలానికి చెందిన మధుబాబు, నర్సింగ్ ధనుంజయ బైక్‌పై పాల్వాయి ధాన్యం మిల్లు నుంచి ధాన్యం అమ్మిన డబ్బులు తీసుకుని తిరిగి దేవరకొండ వైపు వెళుతుండగా చేపూరు ఎక్స్ రోడ్డు వద్ద కారు బలంగా బైక్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నర్సింగ్ మధుబాబు (38), ధనుంజయగౌడ్ (45) కారులో ప్రయాణిస్తున్న మారెడ్డి బాల్‌రెడ్డి అక్కడిక్కడే మృతి చెందారు. డ్రైవర్ తోపాటు కారులోని మిగతా వారికి గాయాలు కాగా 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, కారణాలను తెలుసుకున్నారు. వెంటనే ప్రమాద స్థలికి దేవరకొండ డిఎస్పీ శ్రీనివాసరావు,కొండమల్లేపల్లి సిఐ నవీన్‌కుమార్,గుర్రంపోడు ఎస్ఐ వెంకన్న చేరుకుని ప్రమాద ఘటనను పరిశీలించి పూర్తి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.














