దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటిల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జెఇఇ అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ ఏడాది పరీక్షను నిర్వహిస్తున్న ఐఐటి రూర్కీ సోమవారం అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా ఈ నెల 17వ తేదీన జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరుగనున్నది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 2.30 గంటలకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు.