హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో బొంగులూరు గేట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. హీరో భరత్ కాంత్, సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల విడుదలైన టాలెంట్ సినిమాలో భరత్ కాంత్ హీరోగా నటించడంతో పాటు పలు తెలుగు, హిందీ వెబ్ సిరీస్‌లలో నటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు హీరో భరత్ కాంత్, త్రిలోక్ గా గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.