రంగారెడ్డి: ఓ వ్యక్తి హత్యకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లాలో మీర్ పేట ప్రాంతం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు... ఆదిత్య పాండే అనే వ్యక్తి కురుమలగూడ నివసిస్తూ వెహికల్ సీజింగ్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేేస్తున్నాడు. ఆదివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఆదిత్య పాండేను కత్తులతో పొడిచి చంపేశారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.