
మహారాష్ట్ర పుణే జిల్లాలోని బారామతిలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. శిక్షణకు ఉపయోగించే విమానం బుధవారం కూలిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.
పుణె పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘రెడ్‌బర్డ్’ విమానయాన సంస్థకు చెందిన విమానం శిక్షణ సమయంలో.. సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ఉదయం 8.50 గంటల సమయంలో బారామతి విమానాశ్రయానికి ఆనుకొని ఉన్న గోజుబావి గ్రామం సమీపంలో క్రాష్ ల్యాండ్ అయింది. ఈ ల్యాండింగ్‌కి ముందు విమానంలో కొంత భాగం ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో విమానంలో శిక్షణ తీసుకుంటున్న పైలట్ మాత్రమే ఉన్నాడు. దీంతో అతడు గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి గల సాంకేతిక లోపంపై కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.












