
బంగారం కొనుగోలుపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. బంగారం ధర భారీగా పోరిగిపోయిందని.. ఏడాదిపాటు ప్రజలు బంగారం కొనడం ఆపేయాలని సూచించారు. ఇక, వంట నూనెల వినియోగాన్ని కూడా తగ్గించుకోవాలని చెప్పారు. అలాగే, ఎరువులు, రసాయనాల వినియోగం తగ్గించాలన్నారు. విదేశాల నుంచి భారీగా రసాయన ఎరువులను దిగుమతి చేసుకుంటున్నామని.. రసాయన ఎరువుల వల్ల భూమికి చాలా నష్టం జరుగుతుందని చెప్పారు. వ్యవసాయంలో డీజిల్‌కు బదులు సౌర పంపులను ప్రోత్సహిస్తున్నాంమని.. వ్యవసాయంలో స్వదేశీ వస్తువులను ఎక్కువగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
కనీసం ఏడాది పాటు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని ప్రధాని అన్నారు. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలని.. రసాయన ఎరువులను తగ్గించుకుంటే విదేశీ ద్రవ్యాన్ని మిగిలించుకోగలమని మోడీ చెప్పారు.















