
హైదరాబాద్: ‘జాతిరత్నాలు’ సినిమాతో మంచి పాపులారిటీ సంపాంచుకున్న నటి ఫరియా అబ్దుల్లా. అయితే తాజాగా ఫరియా వివాదంలో చిక్కుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఫరియా బోనాల పండుగకు హాజరయ్యారు. అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత ఆలయం బయటకు వస్తూ.. పోతురాజుతో కలిసి డ్యాన్స్ కూడా దేశారు. అయితే ఇదంతా చూసిన కొందరు ముస్లిం నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆమెను ‘కాఫిర్’ అని, మతానికి మచ్చ తెస్తోందని కామెంట్ చేశారు. ఈ విమర్శలపై ఫిరియా వివరణ ఇచ్చారు. ఇన్స్టాలో వీడియో పెట్టారు.
‘‘నా తండ్రి ఇస్లాం మతాన్ని ఇష్టపడి ఇందులోకి మారారు. ఇస్లాం మతంలోని మంచి విషయాలన్ని నాకు చూపిస్తూ ఆయన నన్ను పెంచారు. నేను కూడా ఇస్లాంలో ఎప్పుడు మంచినే చూశాను. మీరు కూడా మంచినే చూడాలని కోరుకుంటున్నాను. బ్రో, నేను తప్పు చేస్తున్నానని, నేను కఫిర్ అని అంటున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేను చెట్టు, రాయి, సీతాకోకచిలుక.. ఇలా ప్రతిదానిలోనూ జీవాన్ని చూస్తాను. అది మీకు అద్భుతంగా అనిపించకపోతే, దాని వల్ల దేవుడిపై మీ నమ్మకం పెరగకుండా దేవుడికి దూరమైనట్లయితే.. మీరు దేవుడిని తప్పు మార్గంలో వెతుతున్నారని అర్థం.
మీరు కలిసే ప్రతి మనిలో దేవుడిని చూడలేకపోతే కూడా మీరు తప్పు మార్గంలో ఉన్నట్టే. నేను ప్రేమ కోసం ప్రార్థిస్తాను. ఐక్యత కోసం ప్రార్థిస్తాను. శాంతి కోసం ప్రార్థిస్తాను. ఇకపైనా అలానే చేస్తాను. నాపై ద్వేషం చూపించే వారికి కూడా నేను మరింత ప్రేమను పంచుతాను. వారి మంచి కోసం ప్రార్థిస్తాను. నా మనసు నేను ప్రేమని అనుభవించాను. మంచితనాన్ని చూశాను. ‘అల్లా’ అనే పదానికి అర్థం నాకు తెలుసు. అది వెలుగు. ప్రతి చోటా, ప్రతి సమయంలో అన్నింటినీ ఏకం చేసే వెలుగు. ఇంత విశాలమైన దాన్ని మీరు ఎలా సంకుచితం చేయగలరు?’’ అని ఫరియా పేర్కొన్నారు. ఈమె నిటించిన ‘సిగ్మా’ అనే చిత్రం త్వరలో విడుదల కానుంది.








