
మన తెలంగాణ/వికారాబాద్ బ్యూరో: బుల్లెట్ ట్రైన్ల రాకతో తెలంగాణ గేమ్ చేం జర్‌గా మారబోతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ రైల్వే స్టేషన్ పనులను పరిశీలించారు. అంతకుముందు చే వెళ్లలో నేషనల్ హైవే పనులను పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వికారాబాద్‌లో విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. తెలంగాణలో రైల్వే నెట్‌వర్క్‌ను మరింత విస్తరించి ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. తాండూరు, వికారాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్, మౌలాలి, చెర్లపల్లి, మేడ్చల్, యాకుత్‌పుర తదితర స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
రూ.720 కోట్లతో
సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను రూ.720 కో ట్లతో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం తరహా లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. నగరం లో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా చెర్లపల్లి టెర్మినల్‌ను కూడా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపా రు. రైలు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్ర భుత్వం ప్రవేశపెట్టిన ‘కవచ్’ సాంకేతికత ను తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మొదటి దశ పూర్తయిందని, రెండో దశ పనులు కూడా కొనసాగుతున్నాయన్నారు. వరంగల్‌లో నిర్మిస్తున్న రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయని చెప్పారు.
పనులు పూర్తయిన అనంతరం రై ల్వేకు సంబంధించిన వివిధ తయారీ కా ర్యకలాపాలను అక్కడ చేప్టలా చర్యలు తీ సుకుంటామన్నారు. త్వరలోనే ప్రధానమంత్రి చేతుల మీదుగా యూనిట్‌ను ప్రా రంభించేందుకు ప్రయత్నిస్తున్నామని కేం ద్ర మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ -------అ మరావతి-- --చెన్నై, హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్- పుణె మార్గాల్లో హైస్పీడ్ రైలు కనెక్టివిటీకి సంబంధించిన ప్రతిపాదనలు, సర్వేలు జరుగుతున్నాయని తెలిపారు. బు ల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే పరిశ్రమ లు, తయారీ రంగం, పర్యాటకం, రియల్ ఎస్టేట్ అభివృద్ధితోపాటు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య కూడా తగ్గే అవకా శం ఉందని వివరించారు. పూర్తిగా ఎలివేటెడ్ హైస్పీడ్ రైల్ కారిడార్‌గా ఈ ప్రాజెక్టు లు అభివృద్ధి చెందనున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రె డ్డి, కలెక్టర్ దీపక్ తివారి, సికింద్రాబాద్ రై ల్వే డివిజనల్ మేనేజర్ ఆర్. గోపాలకృష్ణ, అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితరులు పాల్గొన్నారు.








