నవతెలంగాణ – హైదరాబాద్ : న్యూజిలాండ్ సమీపంలోని కెర్మెడెక్ దీవుల వద్ద ఆదివారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైనట్లు భూభౌతిక శాస్త్రవేత్తలు తెలిపారు. యూఎస్‌జీఎస్ ప్రకారం భూకంప కేంద్రం సముద్ర ఉపరితలం నుంచి 35–40 కిలోమీటర్ల లోతులో ఉంది. రాత్రివేళ ప్రకంపనలు రావడంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు తెలిపారు.
The post భారీ భూకంపం..రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదు appeared first on Navatelangana.









