కానీ ఫ్రెషర్లు ‘సైలెంట్ ఫైరింగ్’తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

నోమురా నివేదిక

న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) భారతదేశంలో ఉద్యోగాలను తొలగించడం కంటే కొత్త ఉపాధి అవకాశాలనే ఎక్కువగా సృష్టిస్తుందని జపాన్ ఆర్థిక సేవల సంస్థ నోమురా నివేదిక వెల్లడించింది. భారత్, చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో ఎఐతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపింది. మార్కెట్లో ప్రస్తుతం కే-ఆకారంలో విభజన కనిపిస్తోందని నోమురా పేర్కొం ది. ఎఐ రంగంలో అనుభవం ఉన్న సీనియర్ ఉద్యోగులకు, మేనేజ్‌మెంట్ అవగాహన ఉన్నవారికి డిమాండ్ పెరుగుతున్నాయి. అదే సమయం లో కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన ఫ్రెషర్లకు, జూనియర్లకు అవకాశాలు తగ్గుతున్నాయి. కంపెనీలు పాత ఉద్యోగులను తొలగించకుండా, కొత్త ని యామకాలను తగ్గించుకోవడం లేదా క్యాంపస్ సెలక్షన్స్ నిలిపివేయడం వంటి పద్ధతులు పాటిస్తున్నాయి. ఎఐ ద్వారా వస్తున్న కొత్త ఉద్యోగాలలో 90 శాతానికి పైగా కేవలం సాంకేతిక రం గానికే పరిమితమవుతున్నాయి. డేటా యానోటేషన్, లాంగ్వేజ్ స్టడీస్, ఎఐ ఆధారిత ఐటి సేవ ల్లో నియామకాలు జరుగుతున్నాయి. భారత్ ప్ర పంచానికి ఐటి సేవల కేంద్రంగా ఉన్నందున, పాత తరహా పనులను ఎఐ సులభంగా పూర్తి చే స్తోంది. దీంతో సాంప్రదాయ ఉద్యోగాలకు ము ప్పు ఏర్పడినప్పటికీ, భారతీయ ఇంజనీర్ల నైపుణ్యాలను నవీకరించుకుంటే ఈ రంగంలో ముం దడుగు వేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.