
కోనక్రీ: డంపింగ్ యార్డులో చెత్త కొండ కూలిపోవడంతో 30 మంది మృతి చెందిన సంఘటన గినియా దేశంలోని కోనక్రీ పట్టణం శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బెసియా జిల్లా దార్ ఈసాలెంలో డంపింగ్ యార్డు పక్కన గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. చెత్త పేరుకుపోయిన కొండ ఒక్కసారిగా కూలి గుడిసెలపై పడడంతో 30 మంది మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రధాన మంత్రి అమాడౌ ఓరీ బా ఘటనా స్థలానికి చేరుకొని ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.











