టాలీవుడ్ నటుడు ప్రిన్స్ వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. తన ప్రియురాలు సాయి మాచిరాజును పెళ్లి చేసుకున్నాడు. పెద్దల అంగీకారంతో ఆగస్టు 24న న్యూజిలాండ్‌లో వీరి వివాహం జరిగింది .ఈ ఫొటోలను ప్రిన్స్ ఇన్‌స్టాలో పంచుకున్నాడు. ‘జీవితకాలపు బంధానికి స్వాగతం’ అంటూ లవ్ ఎమోజీలతో క్యాప్షన్ ఇచ్చాడు.

ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లిలో న్యూజిలాండ్‌కు చెందిన ఎన్‌ఆర్ఐ సాయి మాజిరాజుతో ప్రిన్స్‌కు పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ ఏడాది జూన్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రిన్స్.. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నీకు నాకు డాష్ డాష్’ చిత్రంలో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. మారుతి దర్శతక్వంలో వచ్చిన ‘బస్‌స్టాప్’ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం హీరోగానే కాకుండా సహాయ నటుడిగా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడు.