
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 2026లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందింది. లక్నో నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని చెన్నై జట్టు.. 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై బ్యాటర్లలో సంజూ శాంసన్(28), రుతురాజ్ గైక్వాడ్(42), ఉర్విల్ పటేల్(65)లు ధనాధన్ బ్యాటింగ్ తో స్టేడియాన్ని హోరెత్తించారు. దీంతో 5 వికెట్ల తేడాతో చెన్నై విజయాన్ని అందుకుంది. దీంతో లక్నో ప్లేఆఫ్ చేరుకోకుండానే ఇంటిదారి పట్టనుంది.
అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేపట్టిన లక్నో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 203 పరుగులు చేసింది. లక్నో ఓపెనర్ జోష్ ఇంగ్లీస్ 33 బంతుల్లో 10 ఫోర్లు 6 సిక్సులతో 85 పరుగులు చేశాడు. చివర్లో షహబాజ్ అహ్మద్ మెరుపులు మెరిపించాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చెన్నై బౌలింగ్‌లో ఓవర్‌టన్ 3, అన్షుల్ 2. నూర్ 1 వికెట్ తీశారు.














