చెన్నై: చెపాక్ స్టేడియం వేదికగా ఈస్ట్ జోన్, సౌత్‌ జోన్ మధ్య ఆదివారం దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్.. తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (111 నాటౌట్) సెంచరీతో చెలరేగిపోయాడు. వన్‌డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ (85) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు.

ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కుమార్ కుశాగ్ర (63 నాటౌట్) అర్థ శతకం సాధించాడు. అంతకు ముందు ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) తొలి వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం జోడించి శుభారంభం అందించారు అభిమన్య రనౌట్ కాగా.. సౌత్ జోన్ బౌలర్లలో చామ మిలింగ్ 2, త్రిపురాణ విజయ్ ఒక వికెట్ పడగొట్టారు.