హైదరాబాద్: యూట్యూబర్ నందన (నందూస్ వరల్డ్)ను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లుక్ అవుట్ నోటీసులు జారీ కావడంతో నందనను పోలీసులు గుర్తించారు. అనంతరం ఎపిలోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురి నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు నందన దంపతులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కేసు నమోదు కావడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నందనపై ఉన్న కేసులు, లుక్ అవుట్ నోటీసుల ఆధారంగా తదుపరి చర్యలకు పోలీసులు నిద్ధమవుతున్నారు.