నవతెలంగాణ-రామారెడ్డి 5 సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్చాలని పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. బుధవారం మండలంలోని గొల్లపల్లిలో ఐదు సంవత్సరాలు నిండిన విద్యార్థుల పట్టికను అంగన్వాడి ద్వారా తీసుకొని, విద్యార్థి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని స్థానిక ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన ఉంటుందని, తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్, సిఆర్పి మహమ్మద్, అంగన్వాడి టీచర్ జ్యోతి తదితరులు ఉన్నారు.

The post ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్చండి  appeared first on Navatelangana.