మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్‌రావు (90) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నాదేండ్ల మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా, 1984లో టిడిపి ప్రభుత్వం హయాంలో సిఎం ఎన్టీఆర్ గుండె శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లినప్పుడు.. ఒక నెల రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాదేండ్ల ముఖ్యమంత్రిగా పని చేశారు.