
ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు విదేశీ పర్యటనపై వెళ్లనున్నారు. ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకూ ప్రధాని మోడీ మూడు దేశాల్లో పర్యటిస్తారు. ఇండోనేసియా, ఆస్ట్రేలియా , న్యూజిలాండ్‌లో జరిపే పర్యటనతో ఆయా దేశాలతో సంబంధాల పటిష్టత చర్చలు జరుపుతారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ శుక్రవారం నాటి ప్రకటనలో తెలిపింది. ముందుగా ఆయన ఇండోనేసియా, ఆస్ట్రేలియాలకు వెళ్లుతారు. మెల్బోర్న్లో ప్రధాని మోడీ ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత న్యూజిలాండ్‌కు వెళ్లుతారని ప్రకటనలో తెలిపారు. న్యూజిలాండ్‌కు గడిచిన 40 ఏండ్లలో భారతీయ ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి, ఈ క్రమంలో మోడీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడిందని విదేశాంగ మంత్రిత్వశాఖలో తూర్పు వ్యవహారాల కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ తెలిపారు.













