
నిజామాబాద్: సొంత కుటుంబమే తనను బయటకు పంపిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం జిల్లాల్లో ఏర్పాటు చేసిన పాంచజన్య సంకల్ప సభలో కవిత మాట్లాడుతూ.. జిల్లాలో బిఆర్ఎస్ నేతలు ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డిల గెలుపు కోసం కష్టపడ్డానని.. కానీ, వారు కుట్ర చేసి తనను ఓడగొట్టారని అన్నారు. ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోగానే.. ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ లో చేరేందుకు చర్చలు జరపారని ఆరోపించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని.. కానీ సొంత కుటుంబం తనను బయటకు పంపిందంటూ చెబుతూ కవిత భావోద్వేగానికి గురయ్యారు.
"ఏం తప్పు చేశానని నన్ను తీహాడ్ జైలులో పెట్టారు?. ఆడబిడ్డ కష్టాల్లో ఉంటే అక్కున చేర్చుకోవాల్సింది పోయి కర్కశంగా నన్ను బయటకు పంపారు. అమ్మ ఇంటివాళ్లు నిర్దాక్ష్యణ్యంగా తరిమేస్తే అత్తింటి వాళ్లు కన్న బిడ్డలా నన్ను అక్కున చేర్చుకున్నారు. సొంతూరుకు వచ్చాక ఆపుకుందామన్న కన్నీళ్లు ఆగడం లేదు. అలాగని నేను పిరికిదాన్ని కాదు. నాలుగేళ్లు ఈడీ, సీబీఐ ఇబ్బంది పెట్టినా ధైర్యం సడలలేదు.. దారి తప్పలేదు. ఏ తప్పు చేయకుండానే జైల్లో పెట్టారు.. అప్పుడే నేను ఏ తప్పు చేయలేదని చెప్పా. నా పెట్టిన అక్రమ కేసును సుప్రీం కోర్టు జడ్జి తీసేసి తన సచ్చీలతను గుర్తించి సీబీఐ ఆఫీసర్ పైనే కేసు పెట్టాలని ఆదేశించారు. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తేవాలన్న సంకల్పంతోనే ముందుకు వచ్చా. బంగారు తెలంగాణ కాదు బహుజన తెలంగాణ కావాలి. ఓ వైపు కాంగ్రెస్ పై పోరాటం చేస్తూనే.. టీఆర్ఎస్ నిర్మాణం చేస్తాం" అని కవిత పేర్కొన్నారు.
ఏం తప్పు చేశానని నన్ను జైలులో పెట్టారు?..కన్నీళ్లు పెట్టుకున్న కవిత
రూ.లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టారు.. నిజామాబాద్ జిల్లాలో ఒక్క ఎకరానికైనా నీరు వచ్చిందా: కవిత








