
అమరావతి: కుటుంబంలో కలహాలు చెలరేగడంతో ముగ్గురు కూతుళ్లను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... కెవి ఆగ్రహారం గ్రామంలో సుధాకర్ అనే వ్యక్తికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. గత కొన్ని రోజులగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో ముగ్గురు పిల్లలు, భర్తను వదిలేసి భార్య పారిపోయింది. భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో సుధాకర్ తీవ్ర మానసికంగా కుంగిపోయాడు. జీవితంపై విరక్తి చెంది ముగ్గురు కూతుళ్లు లోహిత, పూజిత, అచ్యుతలను చంపేసి అనంతరం తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో నుంచి ఉలుకుపలుకు లేకపోవడంతో చుట్టు పక్కల వారు ఇంట్లోకి వెళ్లి చూడగా మృతదేహాలు కనపించాయి. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












