హైదరాబాద్: లేడీస్ హాస్టల్ లో లిఫ్ట్ లో ఇరుక్కొని ఐదేళ బాలిక మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గౌలిదొడ్డిలోని ఓ లేడీస్ హాస్టల్ పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ కుటుంబం వంటలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఐదేళ్ల కూతురు ఉంది. గ్రిల్ లిఫ్ట్ లో బాలిక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఐదో ఫ్లోర్ వెళ్లింది. మూడో ఫ్లోర్ లో చిన్నారి జుట్టు ఇరుక్కుపోవడంతో తల మొత్తం నుజ్జు నుజ్జుగా మారి చనిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందిందని పరీక్షించిన వైద్య సిబ్బంది తెలిపారు. హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.